WAR-2: ఒక్క సాంగ్ తప్ప వార్ -2 షూటింగ్ పూర్తయ్యింది: హృతిక్ రోషన్ 5 d ago

టాలీవుడ్ హీరో జూ.ఎన్టీఆర్ పై బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీళిద్దరూ కలిసి 'వార్ 2'లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల అవుతుందని మరోసారి చెప్పారు. సినిమా షూటింగ్ ఒక సాంగ్ తప్ప అంతా పూర్తయ్యిందన్నారు. జూ.ఎన్టీఆర్ గొప్ప నటుడని, తమ సినిమా అద్భుతంగా వచ్చిందని పేర్కొన్నారు. ఈ భారీ యాక్షన్ మూవీ యశ్రాజ్ ఫిలిమ్స్ సంస్థపై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.